తెలుగు స్టార్ హీరోయిన్ సమంత తొలిసారి నటించిన పౌరాణిక గాధ చిత్రం శాకుంతలం . శకుంతల - దుష్యంతుల ప్రేమకథను దర్శకుడు గుణశేఖర్ దృశ్య కావ్యంగా చాలా గొప్పగా చిత్రీకరించారు. బలమైన కథనాలకు అద్భుతమైన విజువల్స్ ను తోడు చేసి ప్రేక్షకులకు అందించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత కీలకపాత్ర పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు ఇకపోతే ఈ సినిమా నుంచి ఐదు భాషలలో వదిలిన ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు సినిమా నుంచి రెండవ సింగిల్ ని కూడా ఐదు భాషలలో రిలీజ్ చేయడానికి చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేసేది. ఈనెల 25వ తేదీన అంటే ఈరోజు ఈ పాటను రిలీజ్ చేయబోతున్నారు. " ఋషి వనములోన " అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. కన్వ మహర్షి ఆశ్రమ నేపథ్యంలో ఈ పాటలు చిత్రీకరించినట్టుగా మనకు చూస్తే అర్థమవుతుంది.  ఇకపోతే మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. గుణ శేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే.. నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా సమంత సినీ కెరియర్ లోని ఒక మైలురాయిగా నిలుస్తోందని ఆమె భావిస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారబోతోంది అని కూడా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఇందులో మోహన్ బాబు,  గౌతమి,  ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో వచ్చేనెల అంటే ఫిబ్రవరి 17వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.  ముఖ్యంగా ఈ సినిమాను  తెలుగులో ప్రముఖ బడానిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే శివరాత్రి సెలవులను ఉపయోగించుకోవడానికి ఆయన మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా భరతుడి చిన్ననాటి క్యారెక్టర్ పోషిస్తోంది. ఇప్పటికే అల్లు అర్హ కూడా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: