
వీలైనంత తొందరగా రామ్ చరణ్తో తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయడమే టార్గెట్గా పెట్టుకున్నాడట దర్శకుడు శంకర్. అయితే అదే సమయంలో రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. అయితే ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్లు సమాచారం.
అయితే ఉప్పెన సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులను పలకరించిన బుచ్చిబాబు కొత్త కథతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఉండే ట్విస్ట్ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు కూడా బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో కూడా ఇలాంటి ఒక బిగ్ ట్విస్ట్ పెట్టబోతున్నాడట. సెకండ్ హాఫ్ లో ఉండే ఒక కీలకమైన క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతిని అనుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్ కూడా ఏకంగా నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతి అయితే బాగుంటాడని చెప్పాడట. ఇలా చరణ్ సినిమాలో కూడా సేతుపతి పాత్రతో బిగ్ ట్విస్ట్ పెట్టబోతున్నారట బుచ్చిబాబు.