పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలను కేవలం సౌత్ ఇండియా కే పరిమితం చేసినప్పటికీ కూడా ఈయనకు బాలీవుడ్ లోనే కాదు విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకవైపు సినిమాలలో బిజీగా పాల్గొంటూనే.. మరొకవైపుతో తాను స్థాపించిన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పలు ప్రయత్నాలు చేపట్టారు. మరొకవైపు కొత్త సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతున్నారు.

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇంకో పక్క తన మేనల్లుడు హీరో సాయిధరమ్ తేజ్ తో వినోదయా సీతం సినిమా చేస్తున్నారు.  ఇకపోతే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న భగత్ సింగ్ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆయన మరొక కొత్త డైరెక్టర్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సెట్స్ పై ఉండగానే పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో చేయబోతున్నారు.  అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.


ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు ఉదయం జరగబోతున్నాయి.  అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా చిత్ర యూనిట్ అధికారికంగా స్పష్టం చేసింది.  ప్రభాస్తో సాహో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.  ముఖ్యంగా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  పాటలు లేకుండా గంటన్నర నిడివితో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు భారీ సమాచారం మరి భారీ బడ్జెట్ కేటాయించి అన్ని హంగులతో సినిమాను ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. పవన్ కళ్యాణ్ రేంజ్ ను మార్చే సినిమా కాబోతోంది అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: