బాలీవుడ్ బాక్సాఫీస్ కి మళ్ళీ ప్రాణం పోశాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. దాదాపు దశాబ్దం తర్వాత పఠాన్ సినిమాతో తాను కేవలం సాలిడ్ హిట్ ని కొట్టడమే కాకుండా కష్టాల్లో ఉన్న తన బాలీవుడ్ ఇండస్ట్రీని మళ్ళీ ఒడ్డున పడేసాడు షారుఖ్ ఖాన్.హిందీ మార్కెట్ కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకోచ్చిన షారుఖ్ ఖాన్, కేవలం అయిదే అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ ని ఉతికి ఆరేసాడు. షారుఖ్ పని అయిపొయింది అనుకున్న ప్రతి ఒక్కరికీ కూడా దిమ్మతిరిగే షాక్ ఇచ్చే రేంజులో హిట్ కొట్టాడు షారుఖ్. మొదటివారం ముగిసే సమయానికి పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ఏకంగా 'బాహుబలి 2', 'KGF 2' సినిమాల రికార్డులని కూడా చెల్లా చెదురు చేశాడు. ఇక పఠాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కనిపించడంతో సల్మాన్ ఖాన్ ఫాన్స్ కూడా పఠాన్ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వరుసగా క్యూ కడుతున్నారు.టైగర్, పఠాన్ లు కలిస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాంపేజ్ ఎలా ఉంటుందో నిరూపించారు షారుఖ్-సల్మాన్ ఖాన్ లు. బాలీవుడ్ ని 3 దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు తమ సినిమాలని ఒకేసారి రిలీజ్ చెయ్యడం కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరిగితే చూడాలి అని సినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు


కానీ షారుఖ్, సల్మాన్ ఖాన్ లు మాత్రం బాక్సాఫీస్ క్లాష్ కి ఎప్పుడు కూడా కాస్త దూరంగానే ఉంటారు. ఈ విషయంపై షారుఖ్ ఖాన్ క్లారిటీ ఇచ్చేశాడు. 'ఇక పఠాన్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసావ్ కానీ బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ ఖాన్ తో పోటీకి ఎందుకు దిగవు' అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ 'సల్మాన్ ఖాన్ ఆల్ టైం గ్రేటెస్ట్ హీరో #GOAT ' అంటూ నెటిజెన్ కి రిప్లై ఇచ్చాడు. షారుక్ ఖాన్ చెప్పినట్లు సల్మాన్ ఖాన్ నిజంగానే గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం. ఎందుకంటే ఒక ఫ్లాప్ సినిమాతో కూడా వందల కోట్లు రాబట్టగల సత్తా బాలీవుడ్ లో కేవలం సల్మాన్ ఖాన్ కే సొంతం.కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ కూడా GOAT లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య పఠాన్ సినిమాలో ఒక సీన్ కూడా ఉంది. '30 ఏళ్లు గడిచాయి, ఇక మనం రిటైర్ అయిపోదాం' అని సల్మాన్ ఖాన్ అనగానే, ఇక షారుఖ్ ఖాన్ 'నిజమే కానీ మన స్థానంలో నిలిచే వారు ఎవరు? అయినా ఇది దేశ రక్షణకి సంబంధించిన విషయం కదా చిన్నపిల్లలకి వదిలేయలేము' అంటాడు. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వర్తిస్తుంది, హిందీ సినిమా బాగుండాలి అంటే సల్మాన్ ఖాన్-షారుఖ్ ఖాన్ లు హిట్స్ కొట్టాల్సిందే అని దీని అర్ధం.

మరింత సమాచారం తెలుసుకోండి: