నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన తాజా సినిమా దసరా. ఇక ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని కి జోడిగా హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది.శ్రీకాంత్ ఓదెలా  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ను తాజాగా విడుదల చేశారు చిత్ర బృందం.మొదటిసారిగా నాని రా అండ్ రస్టిక్ లుక్ లో ఒక్కసారిగా అందరినీ షాప్ కి గురి చేశారు. మొదటిసారి నాచురల్ స్టార్ నాని ఇలా కనిపించడంతో ఈ సినిమాపై భార్య అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ కూడా ఉండడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. 

15 సెకండ్ల పాటు ఉన్న నాని దసరా సినిమా టీజర్ చూసి. అనంతరం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. నాని అభిమానులు ఈ టీజర్ ను చూసిన అనంతరం దసరా టీజర్ ను  షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ అన్ని వైపుల నుండి ప్రశంసలను అందుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి సైతం దసరా టీజర్ ను రిలీజ్ చేసిన నేపథ్యంలో మూవీ టీంను మెచ్చుకుంటూ ఒక ట్వీట్ ని కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని రాజమౌళి దసరా టీజర్ విజువల్స్ చాలా బాగా వచ్చాయి.. నాకు చాలా నచ్చాయి.. ఇటీజర్ లో నాని భారీ మేకోవర్ తెగ ఆకట్టుకుంటుంది.. 

ఒక సరికొత్త దర్శకుడు ఇలాంటి ప్రభావాన్ని సృష్టించడం నాకు చాలా నచ్చింది.. చివరి షార్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది.. మీకు అంతా మంచే జరగాలి అని రాజమౌళి ట్వీట్ చేయడం జరిగింది. ప్రపంచ స్థాయి దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ని మెచ్చుకోవడంతో ఆయన తెగ సంబరపడిపోతున్నాడు. ఇందులో భాగంగానే శ్రీకాంత్..  సార్ మీ ట్వీట్ కో నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది.. నిజానికి మీకు నేను ఇంగ్లీషులో రిప్లై పెడదాము అని అనుకున్నాను.. కానీ ఇది చూసిన తర్వాత నాకు అసలు తెలుగులోనే మాటలు వస్తలేవు సార్..కోతి లెక్క గెంతుతున్న.. మీకు చాలా ధన్యవాదాలు సార్ అంటూ ఆనందంతో రాజమౌళి ట్వీట్ కి రిప్లై ఇచ్చాడు శ్రీకాంత్ దీంతో రాజమౌళి దసరా సినిమా టీజర్ కి సంబంధించి చేసిన ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: