సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న SSMB -28 సినిమా కోసం అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ని పూర్తి చేస్తున్నారు చిత్ర బృందం. తాజాగా షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లు కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఒక వీడియో వైరల్ గా మారుతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది అన్నట్లుగా అభిమానులకు ఒక అభిప్రాయం వచ్చింది.

SSMB -28 చిత్రీకరణ గ్యాప్లో త్రివిక్రమ్ యూనిట్ తో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో మహేష్ బాబు సెట్ లో ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఆటకు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది .అదేమిటంటే క్రికెట్ ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే సెట్లో త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతూ ఉన్నట్లుగా తెలుస్తోందని సమాచారం.

ఇక సుదీర్ఘకాలం తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కాబట్టి ఈ సినిమాకి కాస్త వెరైటీగా ఉండాలని ఫైట్  ను ఇలా డిజైన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్లు పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ చిత్రం లోని ముఖ్య పాత్రకు అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ అని కూడా ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా సినిమా షూటింగ్ ఆలస్యం కారణం వల్ల ఆగస్టులో వాయిదా వేయడం జరిగింది. మరి సర్కారు వారి పాట సినిమా తో విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఈ చిత్రం తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: