తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో నందమూరి తారకరత్న కూడా పాల్గొన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కొద్దిదూరం నడిచిన అనంతరం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దాంతో వెంటనే అక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆయనకు అక్కడ అత్యవసర చికిత్సను అందించినప్పటికీ మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 

ప్రస్తుతం అత్యంత ఖరీదైన వైద్యాన్ని ఆ హాస్పటల్ వారు నందమూరి తారకరత్న  కు అందిస్తున్నట్లుగా ఇటీవల నందమూరి బాలకృష్ణ మరియు నారా కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వారు నందమూరి తారకరత్న  యొక్క చికిత్సకు అవుతున్న పూర్తి ఖర్చును భరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటు గురయ్యాడు కాబట్టి తనకి సంబంధించిన పూర్తి హాస్పిటల్ ఖర్చును చంద్రబాబు నాయుడు పెట్టుకోవడానికి ముందుకు వచ్చినట్లుగా సమాచారం వినబడుతుంది.

ఇక ఈ విషయాన్ని నందమూరి తారకరత్న భార్యతో స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే నందమూరి ఫ్యామిలీతో పోలిస్తే ఆర్థికంగా కాస్త వెనకబడి ఉన్నాడట తారకరత్న. అందుకే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడట. కానీ మరికొందరు మాత్రం చంద్రబాబు నాయుడు మంచి మనసు వల్లే తారకరత్న హాస్పిటల్ ఖర్చును భరిస్తున్నాడు అంటూ అంటున్నారు. అయితే మొత్తానికి చంద్రబాబు నాయుడు స్వయంగా తారకరత్న హాస్పిటల్ బిల్లును చెల్లించేందుకు సిద్ధం అవ్వడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి బావుందని వైద్యులు ఇటీవల ప్రకటించడం జరిగింది. దీంతో నందమూరి అభిమానులు మరియు నందమూరి ఫ్యామిలీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: