మంచు కుటుంబానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు ఉంది. మోహన్ బాబు, మంచు మనోజ్, విష్ణు, మంచు లక్ష్మి ఇలా అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం వీరు ఎవరు కూడా సినిమాలలో నటించకపోవడం గమనార్హం. వీరు ఎవరు కూడా ప్రస్తుతం పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేక పోతున్నారు. ప్రస్తుతం వీరు ఎలాంటి సినిమాలు చేస్తున్నా కూడా ఆ సినిమాలన్నీ కూడా ట్రోల్స్ కి గురవుతున్నాయి. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా మంచు విష్ణు మరియు భూమా మౌనిక ఫిబ్రవరి 2వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి రెండవ తేదీ ముగిసిన తరుణంలో మంచు మనోజ్ పెళ్లి జరిగినట్టుగా ఎక్కడ కూడా వార్తలు అయితే వినిపించలేదు. గతంలో మంచు మనోజ్ కొద్దిరోజుల క్రితం త్వరలోనే మీరందరూ ఒక మంచి గుడ్ న్యూస్ వింటారు అంటూ తెలియ చేసిన సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ మంచు మనోజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతాడు ఏమో అదే విషయం అయి ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అనంతరం విషయం అది కాదని ...తన తదుపరి సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఆయన తెరకెక్కించబోతున్నట్లుగా తెలియజేశారు. తన సినిమా విషయాన్ని తెలియజేసినప్పటికీ తన పెళ్లి విషయం గురించి మాత్రం స్పందించలేదు మనోజ్.

ఈ నేపథ్యంలోనే తన రెండవ పెళ్లి విషయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి కుటుంబాల కారణంగా మనోజ్ మరియు మౌనిక వివాహం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు వీరిద్దరి పెళ్లి జరగడానికి ఇంకా చాలా సమయం పడుతుందని కూడా అంటున్నారు. ఇక మనోజ్ మొదలుపెట్టిన అహం బ్రహ్మాస్త్రి సినిమా కోసం మంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలం అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి స్పష్టత కూడా రాకపోవడంతో మంచు అభిమానులు ఈ సినిమాపై ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: