తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి ... ఎన్నో మూవీ లకు నిర్మాతగా వ్యవహరించి ఇటు హీరోగా అటు నిర్మాత గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా కొంత కాలం క్రితమే కళ్యాణ్ రామ్ ... మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా అనే మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "అమిగోస్" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించగా , మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ నుండి ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుండడంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 5.84 మిలియన్ వ్యూస్ ను , 131.3 కె లైకులను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే అమిగోస్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. మరి ఇప్పటికే బింబిసారా మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న కళ్యాణ్ రామ్మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే ఫిబ్రవరి 10 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: