యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఎన్టీఆర్ పోయిన సంవత్సరం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఈ మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబో తున్నట్లు ఇప్పటికే ప్రకటించే చాలా రోజులు అవుతుంది .

అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడి చాలా రోజులు అవుతుంది . ఈ మూవీ కి అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందించనుండగా , ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ మూవీ కి కెమెరామెన్ గా వర్క్ చేయనున్నాడు . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది . మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మార్చి 20 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది . ఈ షెడ్యూల్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: