బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కియారా అద్వానీ మరియు సిద్ధార్థ మల్హోత్రా నేడు వివాహ బంధంతో ఒకటైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిన్ననే ఇద్దరు పెళ్లి జరిగింది. కానీ ఆ ముహూర్తాన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే నేడు జైసల్మీర్ లోని ఒక పెద్ద కోటలో వీరిద్దరి వివాహం జరగనుంది. ఇక బాలీవుడ్ తారలైన వీరిద్దరి పెళ్లి వేడుకకి బాలీవుడ్ నుండి కొద్దిమంది సినీ సెలబ్రిటీలు హాజరు కాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మరియు ఉపాసన దంపతులు మాత్రమే వీరిద్దరి పెళ్ళికి హాజరుకానున్నారని తెలుస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ని వార్తలు వస్తున్నప్పటికీ వీరిద్దరూ కూడా తమ పెళ్ళికి సంబంధించిన అధికారిక ప్రకటనను ఎక్కడా కూడా లీక్ చేయలేదు. పెళ్లి తర్వాత అయినా తమ వివాహ నికి సంబంధించిన అధికారిక ప్రకటనను చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి పెళ్లి ఖర్చు మరియు పెళ్లి వంటలు నగలు, చీరలు వంటి రకరకాల విషయాల మీద సోషల్ మీడియా వేదికగా చర్చలు కొనసాగుతున్నాయి.

 ఇదిలా ఉంటే ఇక పెళ్లి తర్వాత  కాపురం చేయబోయే ఇంటికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. సాధారణంగా బాలీవుడ్ సెలబ్రిటీలు జుహులో ఉంటారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లి అనంతరం ఈ  నవ దంపతులు కూడా జుహు ఏరియా లోనే ఒక ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు దాదాపుగా 70 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఆ బిల్డింగ్ను వీరిద్దరూ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. 3500 స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి.ఈ  బంగ్లా ఏకంగా 70 కోట్లట. అయితే మొత్తానికి ఇద్దరు కూడా తమ కెరియర్నే మరియు పర్సనల్ లైఫ్ ని బాగా ప్లాన్ చేసుకొని ఉన్నారని అర్థమైంది. ప్రస్తుతం వీరిద్దరూ కొనుగోలు చేసిన బిల్లింగ్ కి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వేలు అవుతుంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: