
రాజమౌళి తరహా లోనే అటు శంకర్ కూడా తన సినిమాల కోసం భారీగా ఖర్చు చేస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా చరణ్ ఫాన్స్ ని సంతృప్తి పరిచేందుకు సాంగ్స్ కోసం ప్రత్యేకమైన ప్లాన్స్ సిద్ధం చేసుకున్నాడట దర్శకుడు శంకర్. ఇక ఈ చిత్రంలోని ఒక సాంగ్ కోసం కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సాంగ్ ను ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారట. అంతేకాదు ఈ ఒక్క సాంగ్ కోసమే 500 మంది డాన్సర్లను ఇక రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా కియారా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే.
మరో వారం రోజులు ఇక ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ సెట్స్ లోకి రాబోతుంది అన్నది తెలుస్తుంది. ఈ సినిమాలో ఉన్న హైలెట్స్ అన్నింటిలోకెల్లా మొదటి వరుసలో ఈ సాంగ్ ఉంటుందని ఒక టాక్ కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రేక్షకుల ఊహకంగా విధంగా ఉంటుందట. క్లైమాక్స్ పార్ట్ లో వచ్చే 20 నిమిషాల ఎపిసోడ్ కోసం శంకర్ ఏకంగా 20 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న 50వ సినిమా కావడంతో దిల్ రాజు కూడా ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట.