సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. చాలామంది ఆర్టిస్టులు క్యాస్టింగ్ కౌశనం ఎదుర్కొని వారు పడ్డ ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉంటారు.అయితే ఇప్పటివరకు చాలామంది చిన్న హీరోయిన్లు ఈ విషయంపై స్పందిస్తూ వచ్చారు. కానీ స్టార్ హీరోయిన్స్ మాత్రం ఈ విషయాలపై ఎప్పుడూ కూడా మాట్లాడరు. చాలామంది స్టార్ హీరోయిన్లు ఒకప్పుడు ఎంతో ఇబ్బందిపడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామని చెబుతారు గాని ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పరు. అయితే తాజాగా ఇదే విషయంపై సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార మాట్లాడడం జరిగింది.

ఇలాంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారంటూ  వచ్చానని చెప్పింది నయన్. ఇటీవల నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది.తల్లి అయినప్పటికీ కూడా ఈమెకి సినిమా ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార తన కెరియర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పింది..

ఈ నేపథ్యంలోనే పెద్ద స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని .మేకర్స్ దానికి కొన్ని కండిషన్స్ పెట్టారు అని.. దానికి తగ్గట్టుగా నడుచుకోవాలని ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని నాకు కండిషన్ లో పెట్టారంటూ చెప్పుకొచ్చింది నయనతార. అనంతరం వాళ్లు పెట్టిన కండిషన్లో నయనతార కి నచ్చకపోవడంతో అంత పెద్ద సినిమా అయినప్పటికీ రిజెక్ట్ చేశానని తెలిపింది. ఇక ఈ విషయాన్ని ఇటీవల నయనతార ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.ఇన్ని విషయాలను నయనతార చెప్పినప్పటికీ ఆ స్టార్ హీరో ఎవరు? ఏ సినిమా అన్న విషయాలను మాత్రం బయట పెట్టలేదు. ఇదిలా ఉంటే ఇక త్వరలోనే నయనతార బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో ప్రస్తుతం నయనతార చేసిన ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: