మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన సొంత టాలెంట్ తో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వరుస సినిమాలలో నటిస్తూ సక్సెస్ను అందుకుంటూ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోలకి ఒక సరికొత్త డెఫినేషన్ అంటే ఏంటో చెప్పింది పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కి కోట్లలో అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ 2014లో ఎవరు ఊహించిన విధంగా జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. అనంతరం 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తన పార్టీని బలోపేతం చేయడానికి శ్రమిస్తున్నాడు పవన్ కళ్యాణ్. 

ఇదిలా ఉంటే ఇక ప్రత్యర్థి పార్టీల నేతలు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తన మూడు పెళ్లిళ్ల టాపిక్ను ఎప్పుడో మాట్లాడుతూ ప్రసంగాలు పెడుతూ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా తన మూడు పెళ్లిళ్ల విషయాలపై అన్ స్టాపబుల్ షోలో క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్... నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కానీ.. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాను.. ఒకేసారి నేను మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. మూడుసార్లు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను.. భిన్నభిప్రాయాల కారణంగా రెండుసార్లు విడాకులు తీసుకున్నాను.. మొదటి పెళ్లి 1997లో నందిని అని అమ్మాయిని చేసుకున్నాను.. కొన్ని కారణాలవల్ల 2007లో ఆమెకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది..

దాని అనంతరం రేణు దేశాయ్ తో సహజీవనం చేసిన అనంతరం 2009లో ఆమెని రెండవ వివాహం చేసుకున్నాను.. 2012లో కొన్ని కారణాలవల్ల తనకి కూడా విడాకులు ఇవ్వాల్సి వచ్చింది..అనంతరం 2013లో రష్యన్ యువతి అన్న లెజినోవా ని మూడవ పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడో  పవన్ కళ్యాణ్మ్ ఇక అన్నా లేజీనోవా రేణు దేశాయ్ ప్రస్తుతం ఎలా ఉన్నారు మనందరికీ తెలిసిందే. మరీ పవన్ మొదటి భార్య నందిని ఎక్కడుంది ఏం చేస్తుంది అన్న ప్రశ్న చాలా మందిలో నెలకొంది. అయితే పవన్ నుండి విడాకులు తీసుకున్న అనంతరం ఆమె తన పేరుని జాహ్నవిగా మార్చుకుంది. అనంతరం 2010లో కృష్ణారెడ్డి అనే ఒక డాక్టర్ని కూడా పెళ్లి చేసుకుంది ఈమె. దాని తర్వాత అమెరికాలో సెటిల్ అయింది ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: