కెరియర్ మొదట్లో వెండితెరపై నటిగా పలు సినిమాలలో నటించింది రష్మీ. వెండితెరపై పెద్దగా కలిసి రాకపోవడంతో వెండితెరపై సినిమాలకు గుడ్ బై చెప్పి బుల్లితెర కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది రష్మి. బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇలా ప్రస్తుతం రెండు మూడు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ యాంకరింగ్ మాత్రమే కాకుండా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదలై సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

త్వరలోనే ప్రేమికుల దినోత్సవం రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం చెప్పు బుజ్జి కన్నా అనే ఒక కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కానుంది. అయితే ఇందులో భాగంగానే ఎప్పటిలాగే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ఈ షో కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే చివరిలో ఫ్లేమ్స్ అనే ఒక ఆటని అందరూ ఆడడం జరిగింది .ఈ ఆటలో మొదట వర్ష ఇమాన్యుల్ మధ్య ఫ్రేమ్స్ చేయగా ఇద్దరికీ మ్యారేజ్ అని వస్తుంది. అనంతరం హైపర్ ఆది సుధీర్ రష్మీ పేర్లను ఫ్రేమ్స్ చేశారు. రష్మీ వెంటనే ఆది చేతిలోనే పేపర్ ని చంపేస్తుంది.

అనంతరం ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంటుంది రష్మి. దీంతో రష్మీ వేదికపైనే అందరి ముందు కంటతడి పెట్టుకోవడంతో చాలామంది సుదీర్ ను గుర్తుచేసుకొని రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది అంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం మల్లెమాలవారు ఈ ఎపిసోడ్ కి మంచి హైట్ తీసుకోరావాలని మాత్రమే ఇలాంటివి చేస్తున్నారు అంటూ మల్లెమాలపై మండిపడుతున్నారు. ఇక ఈ షోలో రష్మీ కంటతడి ఎందుకు పెట్టుకుందో తెలియాలి అంటే ఈ షో ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: