పెళ్లి తర్వాత కాజల్ ఎప్పుడేప్పుడు సినిమాల్లో నటిస్తుందా అని ఆమె అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాజల్ చివరిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా ప్లాన్ చేయబోతుంది.ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్టును లైన్ లో పెడుతూ బిజీగా ఉంది. అయితే ఇప్పటికే కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో కాజల్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ బాలయ్యకు జోడిగా తొలిసారి నటించబోతుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా కూడా ఫిక్స్ అయింది అంటూ అంటున్నారు. ఇక ప్రస్తుతం సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.

 ప్రస్తుతం బాలకృష్ణ వరస హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే ప్రస్తుతం కాజల్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే కాజల్ బాలయ్య సరసన నటించేందుకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లి అయినప్పటికీ కూడా సినిమాల్లో నటించేందుకు రెమ్యూనరేషన్ ఏమాత్రం తగ్గించడం లేదట కాజల్. సినిమాకి కాజల్ కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకు పోతుంది అన్నట్లుగా తెలుస్తోంది. పెళ్లికి ముందు కాజల్ తన ఒక్కో సినిమాకి గానో కోటికి పైగానే రమ్యునరేషన్ను తీసుకునేది. ప్రస్తుతం పెళ్లి తర్వాత కూడా అదే ఫాలో అవుతోంది కాజల్.

దీంతో బాలయ్య సరసన నటించే ఛాన్స్ రావడం అంతేకాదు దీంతోపాటు పెళ్లికి ముందు తీసుకున్న రేంజ్ లోనే రెమ్యూనరేషన్ తీసుకోవడంతో ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇక నందమూరి బాలకృష్ణ ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా గత నెలలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏ మాత్రం ఆలస్యం లేకుండా శరవేగంగా జరుగుతుంది. ఈసారి బాలకృష్ణ ఈ సినిమాతో తెలంగాణ గడ్డపై గర్జించబోతున్నట్లుగా కూడా అంటున్నారు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: