టాలీవుడ్ స్టార్ హీరో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరు అవ్వగా ఆ మొదటి ఎపిసోడ్ కు జనాల నుంచి అంచనాలకు మించి భారీ రెస్పాన్స్ అనేది వచ్చింది.ఈ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. అలాగే మరో మూడు రోజుల్లో ప్రసారం కానున్న పార్ట్2 ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్  ఎక్కువగానే ఉంది. ఈ ఎపిసోడ్ ఏ సమయానికి స్ట్రీమింగ్ కానుందో ఇంకా తెలియాల్సి ఉంది.అయితే పవన్ కళ్యాణ్ కు ఒక క్వాలిటీ మైనస్ అవుతోందని ఆ ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ మారితే ఆయన కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు  ఉంటాయని ఇంకా అంతేగాక ఆయన పార్టీకి కూడా మేలు జరుగుతుందని అనేక రకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్ స్టాపబుల్ పార్ట్1 లో తన పెళ్లిళ్ల గురించి వచ్చిన విమర్శలపై పవన్ కళ్యాణ్ చాలా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. నేను కావాలని మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని అది అలా జరిగిపోయిందని పవర్ స్టార్ పవన్ చెప్పుకొచ్చారు.అయితే ఈ రాజకీయాలలో సొంతవాళ్లను కూడా అనుమానించాల్సి ఉంటుందని అయితే ఆ గుణం తనలో లేదని పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్లు చేశారు.


అయితే పవన్ కళ్యాణ్ అందరినీ నమ్మకూడదని అలాగే పవన్ కు మంచితనం ఎక్కువగా ఉండటం ఇంకా తప్పు చేసిన వాళ్ల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించకపోవడం పెద్ద మైనస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మారాలని జాలి, దయ కొన్ని సందర్భాల్లో పనికిరావని ఆయన ఫ్యాన్స్ కూడా సూచిస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా 60 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోని ఈ ఏడాది సెకండాఫ్ లో  రిలీజ్ కానుంది. హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో  చాలా స్పెషల్ మూవీగా నిలవడంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు కచ్చితంగా నచ్చుతుందని కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పారితోషికం 60 కోట్ల రూపాయలకు ఉండగా ఈ పాన్ ఇండియా సినిమా తరువాత రాబోయే రోజుల్లో పవన్ పారితోషికం ఏకంగా 100 కోట్ల రూపాయలకు చేరే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: