ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో పూజ హెగ్డే, రష్మిక మందన ముందు వరుసలో ఉంటారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సౌత్ లోనే ఈ ఇద్దరు హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అంతేకాదు చేస్తున్న సినిమాలకు ఇతర హీరోయిన్స్ కంటే కూడా కాస్త ఎక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. గత ఏడాది పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన. దీంతో తన తన రెమ్యూనరేషన్ ని డబుల్ చేసేసింది. అటు పూజ హెగ్డే కూడా అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుని తన రెమ్యూనరేషన్ రెండు నుంచి మూడు కోట్లకు పెంచేసింది. 

ఇక ప్రస్తుతం ఈ ఇద్దరూ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ స్టార్డం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తెలుగుతోపాటు తమిళ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే మహేష్ బాబు సరసన ఓ సినిమాలో నటిస్తోంది. త్రివిక్రమ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప 2' సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ హీరోయిన్స్ కి ఇస్తున్న రెమ్యూనరేషన్ ని ఒక్కసారి పరిశీలించినట్లయితే పూజా హెగ్డే తో పోలిస్తే రష్మిక మందన రెమ్యూనరేషన్ ఎక్కువ అన్నట్లుగా తెలుస్తోంది.

పుష్ప పార్ట్ వన్ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. కాబట్టి ఇప్పుడు పార్త్ 2 లో ఆమె కచ్చితంగా ఉండాలి. అందుకే రష్మికకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సుకుమార్ పార్ట్ 2 కోసం తీసుకున్నాడట. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తే ఆమె గత సినిమాలు నిరాశపరిచాయి. అందుకే ఇప్పుడు మహేష్ బాబుతో నటిస్తున్న సినిమాకి గాను ఆమెకు రెమ్యూనరేషన్  కాస్త తగ్గించి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మహేష్ తో ఈమె నటిస్తున్న సినిమా కనుక హిట్టయితే మళ్లీ పూజా హెగ్డే తన రెమ్యూనరేషన్ ను పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న మహేష్ -  త్రివిక్రమ్ మూవీ ఆగస్టు నెలలో విడుదలయ్య అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: