ఇటీవల కాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి కెరియర్ లో సూపర్ హిట్గా నిలిచిన సినిమాలను అభిమానుల కోరిక మేరకు అటు మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇలా ఇటీవల కాలంలో మళ్ళీ మంచి క్వాలిటీతో సినిమా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు అభిమానులు అందరికీ కూడా పూనకాలు తెప్పిస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇలా ఇప్పుడు వరకు స్టార్ హీరోల కెరియర్ లో హిట్ అయిన సినిమాలను మాత్రమే రిలీజ్ చేయడం చూశాము. కానీ ఇప్పుడు ఏకంగా ఒక ఫ్లాప్ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు అన్నది మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్హీరోగా.  జెనీలియా హీరోయిన్ గా నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆరెంజ్ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేకపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఉన్న సరికొత్త కాన్సెప్ట్ అటు ప్రేక్షకులకు ఎక్కడ ఎక్కలేదు. దీంతో ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న నాగబాబుకు అటు భారీ నష్టాలు కూడా వచ్చాయి. అయితే ఇలాంటి ఫ్లాప్ సినిమాను ఇక ఇప్పుడు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్నది తెలుస్తుంది. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27వ జరిగనుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆరెంజ్ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఈ సినిమా నిర్మాత నాగబాబు ప్రకటించారు. అభిమానుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పుకోచ్చాడు. ఇక ఈ సినిమా రీ రిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రీ రిలీజ్ లో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: