టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున కొడుకుల్లో ఒకరైన నాగ చైతన్య ఒకరు. ఐతే ఆయన చైతూ ఎంట్రీ ఇవ్వడం ప్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం మంచి హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.

అంతేకాదు వరుస హిట్స్ తో ఒకానొక సమయంలో మంచి ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఈ మధ్య కాలంలో చైతన్య వరుస ప్లాప్స్ అందుకుంటున్నాడు.

'థాంక్యూ' మూవీ తో స్టార్ట్ అయిన ప్లాప్స్ పరంపర ఆ తర్వాత లాల్ సింగ్ చడ్డా వరకు వచ్చింది. దీంతో మళ్ళీ చైతూ రేసులో వెనుక బడ్డాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ సెలక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నాడు.ప్రెసెంట్ నాగ చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా 'కస్టడీ'.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు.

తమిళ్, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కుతుంది.దీంతో ఈ మూవీ కు భారీగానే బడ్జెట్ పెడుతున్నారు. మరి చైతూ మొదటి నుండి ఎలాంటి పాత్రలో అయినా తనదైన శైలిలో మెప్పిస్తాడు అనే విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు చేస్తున్న కస్టడీ సినిమాలో కూడా తనని తాను మరింత ప్రూవ్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేసిన విషయం విదితమే.ఈ టీజర్ చూసిన తర్వాత ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ రాకపోవడం విశేషం.ఆద్యంతం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ టీజర్ తో అంచనాలు పెంచేసుకుంది. దీంతో థాంక్యూ ప్లాప్ ను మరిపించే హిట్ అందుకుంటాడు అని అక్కినేని ఫ్యాన్స్ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా మే 12న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

ఐతే ఈ మూవీ నాగ చైతన్య కేరిర్ లో ఒక మైల్ స్టోన్ గా ఉండాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: