సినిమా ఇండస్ట్రీలో నైనా చాలామంది హీరోలు తాము రిజెక్ట్ చేసిన సినిమాలు విజయం సాధిస్తే చాలా ఫీలవుతారనే సంగతి తెలిసిందే. అదే సమయంలో తాము రిజెక్ట్ చేసిన సినిమాలు ఫ్లాపైతే మాత్రం ఆ సినిమా నుంచి తప్పించుకున్నామని హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది.

ఐతే తాజాగా సాయితేజ్ విషయంలో అలాగే జరిగింది. ఇటీవల విడుదల ఐనా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా సాయితేజ్ రిజెక్ట్ చేసిన సినిమా కావడం గమనార్హం. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో నాగశౌర్య ఖాతాలో  మరో ఫ్లాప్ చేరింది. 11 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేదు. కథల ఎంపికలో నాగశౌర్య పొరపాట్లు చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా ఆయన స్థాయిలో లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

నాగశౌర్య అవసరాల కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో కథ మరీ అద్భుతంగా లేకపోయినా నాగశౌర్య ఈ సినిమాకు ఓకే చెప్పడం జరిగింది. ఫలితంగా కెరీర్ విషయంలో నాగశౌర్య మరో తప్పటడుగు వేశారు. ఈ సినిమాలో లుక్ ను మార్చుకోవడం కోసం నాగశౌర్య ఎంతగానో కష్టపడ్డారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సాయితేజ్ మాత్రం కథ విన్న వెంటనే ఈ సినిమా ఫలితం తెలిసి వెంటనే మొహమాటం లేకుండా నో చెప్పడం జరిగింది. వరుస విజయాలు సాధిస్తున్న పీపుల్స్ మీడియా బ్యానర్ కు ఈ సినిమా ఫలితం షాకిచ్చింది. సాయితేజ్ నటించిన విరూపాక్ష మూవీ వచ్చే నెల 21వ తేదీన రిలీజ్ కానుంది. పవన్ సాయితేజ్ కాంబోలో తెరకెక్కుతున్న వినోదాయ సిత్తం మూవీ రీమేక్ షూట్ కూడా శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఏదేమైనా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో ఒక్క సాయి ధరమ్ తేజ్ కేరిర్ మొదట్లో మంచి విజయాలు అందుకున్న తర్వాత తర్వాత ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ లో దమ్ము లేక అవి అతనికి నిరాశ చెందిస్తున్నాయి. కనుకనే ఆయన పవన్ కాంబో మూవీ పై ఫుల్ గా ఆశలు పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: