బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో జాన్వీ కపూర్ కూడా ఒకరు. ధడక్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి తోనే సూపర్ హిట్ ను అందుకుంది.ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను తెచ్చుకుంది. అయితే బీటౌన్‏లో అగ్రకథానాయికగా ఉన్న జాన్వీ ఇప్పుడు దక్షిణాదిలో లు చేసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తనవరకు స్టోరీస్ వస్తే తప్పకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గతంలోనే చెప్పుకొచ్చింది.ఇక ఇప్పుడు  ఎన్టీఆర్ తో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

 మాస్ డైరెక్టర్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్ గా చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. అయితే ఈ రెగ్యూలర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ అయితే కాలేదు. ఫస్ట్ అప్డేట్స్ వచ్చి నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ ఈ మూవీ పట్టాలెక్కలేదటా.. దీంతో అభిమానులలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ షూటింగ్ కోసం తాను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చిందటా జాన్వీ.

ఢిల్లీలో ఇండియా టూడే నిర్వహించిన కాన్‏క్లేవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది. ఈ మూవీ షూటింగ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాగే ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని చెప్పింది.

“ఎన్టీఆర్ గ్రేస్ చూసి నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎప్పుడూ ప్రారంభమవుతుందా అని రోజులు కూడా లెక్కబెడుతున్నాను. ప్రతిరోజూ దర్శకుడికి మెసేజ్ కూడా చేస్తున్నాను నేను. ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం నా డ్రీమ్.ఇటీవల ఆర్ఆర్ఆర్ కూడా చూశాను. అతని నటన గ్రేస్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో అతి పెద్ద సంతోషాలలో ఒకటి” అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. ఎన్టీఆర్ లో తనకు అవకాశం రావాలని దేవుడికి కూడా మొక్కుకున్నా. అలాగే ప్రతి ఇంటర్వ్యూలో తనకు ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని చెప్పానని… చివరకు ఎన్టీఆర్ లో ఛాన్స్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది

మరింత సమాచారం తెలుసుకోండి: