టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్నా పేరు గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆయన నటించిన భోళా శంకర్  చిత్రాన్ని ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఐతే అదే సమయానికి మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాక పోవడంతో ఆ తేదీ కి చిరంజీవి సినిమా ను విడుదల చేయాలని నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చిత్ర నిర్మాతలు కనీసం మహేష్ బాబు సినిమా చిత్ర నిర్మాతలను సంప్రదించలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

చిరంజీవి అయినా ఈ విషయంలో కాస్త చొరవ తీసుకుని ఉండాల్సిందని, విడుదల తేదీ విషయం లో అందరి నిర్ణయాలతో ముందుకు వెళ్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.మహేష్ బాబు మరియు చిరంజీవి ఒకే వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తే ఫలితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కనుక మహేష్ బాబు కచ్చితంగా ఒక వారం అటు లేదా ఇటుగా ప్రేక్షకుల ముందుకు వస్తాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. చిరంజీవి సినిమా కారణంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు నెల రెండవ వారంలో రావాలనుకున్న ఖుషి సినిమా తేదీ మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక మెగాస్టార్ సినిమా విడుదల తేదీని హఠాత్తుగా ప్రకటించడం వల్ల ఇతర సినిమాలు చాలా వరకు విడుదల తేదీ విషయంలో గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ముందస్తుగానే చిరంజీవి వంటి పెద్ద స్టార్ హీరోల సినిమాల విడుదల తేదీల విషయంలో కాస్త క్లారిటీగా ఉండాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీ ని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు లోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు అనేది చూడాలి.

చూడాలి మరీ ఈ విషయంలో ఎవరు వెనక్కి తగ్గుతారో ఎవరు ముందు వరుసలో ఉండి వాళ్ళ సినిమాను రిలీజ్ చేసుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: