
ఆహాకు చెందిన అధికార ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు అల్లు అరవింద్.. ఈ ట్విట్ విషయానికి వస్తే ఉదయం ఒక చేతిలో కాఫీ మరొక చేతిలో పేపర్ ఆహా ఆ ఊహ చాలా బాగుంది కదా అంటూ.. అందుకే మీ ముందుకి ఆహ దినపత్రికతో రాబోతున్నాము అన్నట్టుగా ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. ఈ వార్తాపత్రికకు సంబంధించి లోగో ను కూడా షేర్ చేశారు అల్లు అరవింద్.. ఆహ నుంచే లోగో రావడంతో అభిమానులు మీడియా సంస్థలు దృష్టిని ఆకర్షిస్తోంది.చాలామంది ఈ కొత్త పేపర్ పైన స్పందించడం జరిగింది. కొంతమంది ఏప్రిల్ ఒకటవ తేదీన ఫుడ్స్ డే సందర్భంగా అల్లు అరవింద్ ఇలా ప్రకటన వెలువడిచారేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ ప్రకటన ఫ్రాంక్ అని మరికొంతమంది అనగా కొంతమంది మాత్రం జనసేన పార్టీకి సపోర్టుగా చేస్తున్నారేమో అన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఫ్రాంకా లేకపోతే నిజమా అనే విషయం తెలియాల్సి ఉంది ఇదంతా ఇలా ఉంటే వినాధ రంగంలో ఏప్రిల్ ఫూల్స్ చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది ఇలా ఆహా కూడా ఇలాంటి ట్రిక్కునే ప్లే చేసిందేమో అంటూ కామెంట్ చేస్తున్నారు మరి అసలు విషయాన్ని అల్లు అరవింద్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.