టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందD అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అందంతో డ్యాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. హీరోయిన్గా మొదటి సినిమాతో ఎవరెజ్ టాక్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అతి తక్కువ సమయంలోనే అవకాశాలను అందుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది. తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎక్కువ కాలం కాలేదని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుతున్నట్లు తెలుపుతోంది.



అందుకే తాను పాత్రలను డిమాండ్ చేయడం లేదని తనకు వచ్చిన పాత్రలను చేస్తున్నానని అలాగే సినిమాల తన పాత్ర చాలా బలంగా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అసలు డిమాండ్ చేయలేదంటూ తెలియజేస్తోంది. మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ రూల్ పాత్రకు కూడా ఓకే చెప్పింది. అంతేకాకుండా బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా ఈ అమ్మడు బాలయ్య కూతురు పాత్రలో నటించబోతోంది తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా తను నటించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలియజేసింది.


వారంలో ఒక్కరోజు కూడా కాళీ లేకుండా బిజీ షెడ్యూల్ తో పాల్గొంటున్నట్లుగా తెలియజేసింది. ఇలాంటి సమయంలో కెమెరా ముందుకు వెళ్లలేక పోతే ఆరోజు చాలా వెలతీగా ఉంటుంది అంటూ శ్రీ లీల తెలియజేస్తోంది మొత్తానికి తన కెరియర్ పరంగా చాలా క్లారిటీగా ఉంది ఈ ముద్దుగుమ్మ ముఖ్యంగా హీరోల అభిమానులే ఎక్కువగా ఉంటారు. హీరోయిన్లు చూసేవారు మొదటి రెండు మూడు రోజులకే థియేటర్ కు వస్తారు కనుక హీరోలకు ప్రాధాన్యత ఉండడంలో ఎలాంటి తప్పు లేదంటూ క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: