పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ  బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే టాలీవుడ్ దర్శకులే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ దర్శకుడు సైతం ప్రభాస్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఊహలకు అందని డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. బాహుబలి తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. సుజిత్ రాధాకృష్ణ లాంటి అనుభవం లేని దర్శకులతో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో తీశాడు ప్రభాస్. 

అంతే కాకుండా మారుతి లాంటి మీడియం డైరెక్టర్ తో కూడా ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ప్రభాస్ .ఇక ఈ సినిమా తర్వాత   దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఈ డైరెక్టర్ మినహా మిగిలిన డైరెక్టర్స్ అందరూ కూడా చిన్న డైరెక్టర్స్.అయితే తాజా సమాచారం ప్రకారం  ఇప్పుడు ప్రభాస్ మరో మీడియం రేంజ్ డైరెక్టర్ తో కొత్త సినిమా ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఆ డైరెక్టర్ ఎవరో కాదు సీతారామం వంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన హను రాఘవపూడి.అయితే ఈయన  ఇటీవల ప్రభాస్ ని కలిసి స్టోరీ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇక స్టోరీ విన్న ప్రభాస్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాకుండా  ఈ సినిమా వరల్డ్ వార్ టు నేపథ్యంలో రాబోతోందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు అని తెలుస్తోంది. అనురాగవపుడి మంచి డైరెక్టర్ అన్న మాట వాస్తవమే. కాకపోతే ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ హీరోని మానేజ్ చేయగలడా లేదా అన్నది చూడాలి .ఎందుకంటే ప్రభాస్ గత రెండు సినిమాలు తీసిన డైరెక్టర్లు ఇద్దరు కూడా ఆయన స్టార్ ఇమేజ్ ని మ్యాచ్ చేయలేకపోయారు.ఇక ఇప్పుడు ఈయన ఈ ఎలా సినిమా తీస్తాడు అన్నది చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: