దగ్గుపాటి హీరో రానా తాజాగా ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్టు కే' సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాజెక్ట్ K మూవీ తెలుగు నుంచి తొలి గ్లోబల్ సినిమాగా నిలుస్తుందని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచాడు. అంతేకాదు ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దగ్గుపాటి రానా ప్రాజెక్ట్ K మూవీ పై స్పందించాడు. ఈ మేరకు రీసెంట్ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. "సౌత్ ఇండియాలో మేము ఒకరి సినిమాలను మరొకరం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఓ సినిమా వస్తుంది. ఆ సినిమా పేరు ప్రాజెక్ట్ K. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్ నటిస్తున్న సినిమా అది. తెలుగులో ఆ సినిమా కోసం మేమంతా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా సరిహద్దులను చేరిపేస్తుంది. 

ఇప్పటివరకు బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు సాధ్యంకాని పని అది. కానీ ప్రాజెక్టుకి కచ్చితంగా ఆ ఫీట్ ని అందుకుంటుంది. నేను ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ తెలుగు నుంచి ఓ గ్లోబల్ సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను" అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు దగ్గుపాటి రానా. దీంతో రానా చేసిన కామెంట్స్ ఒక్కసారిగా ప్రాజెక్ట్ K మూవీ పై అంచనాలను పెంచేసింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని దత్ సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో దీపికా పదుకొనే తో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాన్ని కీలక పాత్ర పోషిస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 12 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ విడుదల కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే షూటింగ్ ఆలస్యమైతే విడుదల తేదీ మారే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ షూటింగ్లో గాయపడ్డాడు. ఇక ఆయన కోలుకోవడం కాస్త ఆలస్యం అవడంతో ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా ఆలస్యమైంది. దీంతో అనుకున్న డేట్ కి ప్రాజెక్ట్ K రిలీజ్ కష్టమే అంటూ ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: