సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది నయనతార.అనంతరం దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని 40 ఏళ్ల వయసుకు దగ్గరవుతుంది. పెళ్లి చేసుకున్న అనంతరం సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల అయ్యింది ఆమె. అయినప్పటికీ అదే అందం అదే ఫిట్నెస్ తో లేడీ సూపర్ స్టార్ గా  సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన అందం ఫిట్నెస్ రహస్యాలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది నయనతార. 

ఇక వాటికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే నయనతార బరువు తగ్గడానికి ఇంత ఫిట్గా ఉండడానికి కారణం జిమ్ వర్కౌట్స్ మరియు యోగ ముఖ్య కారణం అని సమాచారం. అంతేకాదు క్రమం తప్పకుండా నాయనతార యోగ చేస్తుందిట. అంతేకాదు తను తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొబ్బరినీళ్లు ఉంటాయట. ఉదయం అల్పాహారంలో పళ్ళు కచ్చితంగా ఉండాల్సిన పళ్ళ రసం వల్ల బరువును తగ్గించుకోవడంతో పాటు ఎనర్జీ కూడా పెరుగుతుందని క్రమం తప్పకుండా ఇదే ఫాలో అవుతుందట నయనతార. ఇక మధ్యాహ్న భోజనంలో మాంసాహారం గుడ్డు వాటితో పాటు కూరగాయలను కూడా తీసుకుంటుందట.  

కార్బోహైడ్రేట్స్ ఉన్న పదార్థాలను అస్సలు తీసుకోదట. సరైన నిద్ర కూడా బరువును అదుపులో పెడుతుందని వెల్లడించింది నాయనతార. కచ్చితంగా ఎనిమిది గంటలు నిద్రపోయేలా తన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటుందట ఆమె. ఈ క్రమంలోనే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే నయనతార కొంత కాలం పాటు నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసిన తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు తన పిల్లల్ని స్వయంగా తానే చూసుకోవాలని ఉద్దేశంతో నయన్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: