ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ప్రభాస్ ఒకరు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ హీరో నటించిన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రభాస్ నటించిన ఆఖరి 5 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ జూన్ 16 వ తేదీన విడుదల కాబోతోంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

ప్రభాస్ ఆఖరుగా రాదే శ్యామ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 202.80 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

ప్రభాస్ హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ... ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 1 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: