పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. పవన్ ఎక్కడికి వెళ్లినా జనం ఊహించని స్థాయి లో హాజరవుతారనే సంగతి తెలిసిందే.అయితే పవన్ ఫ్యాన్ ఒకరు పవన్ పై అభిమానం చూపించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా ఈ వీడియోను చూసిన అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. ఇంత గొప్ప అభిమానులను కలిగి ఉన్న పవన్ గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం లో పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన భాస్కర్ అనే బధిర అర్చకుడు పవన్ ను చూడగానే తెగ సంతోషించారు. పవన్ పై ఈ అభిమాని చూపిన అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పవన్ ను హత్తుకుని ఈ అభిమాని తన అభిమానాన్ని ప్రదర్శించారు. తనకు మాటలు రావని అవతలి వ్యక్తులు చెప్పే మాటలను వినలేనని అయినప్పటి కీ జనసేన గెలవాలని కోరుకుంటున్నానని భాస్కర్ తన సైగల ద్వారా చెప్పుకొచ్చారు.

భాస్కర్ కు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానమని పవన్ ప్రతి సినిమాను రెండుసార్లు లేదా మూడుసార్లు చూస్తాడని భాస్కర్ తో పాటు ఉన్న అర్చకులు పవన్ కు అంతా అనుకూలంగా జరగాలని భాస్కర్ తన సైగలతో చెప్పుకొచ్చారు. అభిమాని చూపించిన అభిమానానికి పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషించారు. ఇలాంటి అభిమానులు పవన్ కు వేల సంఖ్య లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలలో అటు రాజకీయాల లో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు ఆకాంక్షించడంతో పాటు కష్టపడుతున్నారు. గత ఎన్నికల సమయం లో పవన్ కు చేదు ఫలితాలు ఎదురవగా ఈ ఎన్నికల్లో మాత్రం అలాంటి పొరపాట్లు ఎదురు కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు భీమవరం నియోజకవర్గం లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: