ప్రపంచవ్యాప్తంగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో సంచలనం క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు సలార్ సినిమాతో థియేటర్లలో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్‏తో అత్యంత ప్రతిష్టాత్మకంగా హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో హైప్ ఏర్పడింది.ఇంకా గతంలో విడుదలైన పోస్టర్స్ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సెప్టెంబర్ నెలలో అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో సలార్ మూవీ ప్రమోషన్స్ జరిపేందుకు మేకర్స్ చాలా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. 


ఇంకా అలాగే ఫ్యాన్స్ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈ మూవీ టీజర్‏ను జులై 6 వ తేదీన అనగా రేపు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.జూన్ 6 వ తేదీన తెల్లవారుజామున 5.12 గంటలకు సలార్ మూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే.. సలార్ మూవీ టీజర్ తెల్లవారుజామునే విడుదల చేయనుండడంతో ఆ టీజర్ పై తమకున్న ఆసక్తిని మీమ్స్ రూపంలో తెలియజేస్తున్నారు ఫ్యాన్స్ . చాలా రోజులుగా సలార్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు టీజర్ కోసం ఏకంగా అలారం పెట్టుకుంటామంటూ ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుండగా.. సలార్ అలారం మీమ్స్ అయితే నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: