స్టార్ హీరోల పిల్లలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే ఆ స్టార్ హీరోల పిల్లల క్రేజ్ ను తమ వ్యాపార సంస్థల క్రేజ్ పెంచుకోవడానికి చాల తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు మహేష్ గారాల కూతురు సితార విషయంలో అదే జరుగుతోంది. వాస్తవానికి మహేష్ తన కూతురును అంతరిక్ష శాస్త్రవేత్తగా తయారుచేయాలని భావిస్తే సితార అభిరుచి మాత్రం గ్లామర్ ఫీల్డ్ పై ఉంది.


ఇప్పటికే సితార నుండి ఒక వీడియో వచ్చింది అంటే అది సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అనేక లక్షల మంది ఫాలోయర్లు సితార కు ఉన్నారు అంటే ఆమె మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది. లేటెస్ట్ గా ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జ్యూయలర్స్ ‘సితార కలెక్షన్’ పేరుతో ఒక స్పెషల్ బ్రాండ్ ని సృష్టించింది.


దీనికి సంబంధించిన ప్రకటన న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం చాలమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రకటనలో సితార నటించినందుకు ఆమెకు కోట్లాది రూపాయాలలో పారితోషికం ఆ సంస్థ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ కిడ్స్ లో సితారకు ఉన్నంత ఆదాయం మరే స్టార్ కిడ్ కు లేదు అని అంటారు. ఈమధ్య జరిగిన దిల్ రాజ్ కొడుకు పుట్టినరోజుకు సితార మహేష్ తో కలిసివచ్చి స్టార్ ఎట్రాక్షన్ గా మారినట్లు తెలుస్తోంది.


ఆ పార్టీకి వచ్చిన అతిధులు అంతా సీతారను పలకరించడమే కాకుండా తమ సినిమాలలో నటిస్తావా అని అడిగినప్పుడు మహేష్ వైపు కూడ కొంచమైన చూడకుండా తాను రెడీ అంటూ చెప్పిన సమాధానం విని చాలామంది ఆశ్చర్యపోయారట అందరు. అంతేకాదు సితార హీరోయిన్ గా అయితే ఆమెకు ఉన్న క్రేజ్ రీత్యా 100 కోట్లు పారితోషికం పుచ్చుకునే స్థాయికి ఆమె చేరుకున్నా ఆశ్చర్యయంలేదు అంటూ అందరు నవ్వుతూ జోక్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: