36 రోజుల్లో ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ను తీశారంటే లోకేశ్ కనగరాజ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. లోకేశ్ కనగరాజ్ తన డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్టర్ సినిమా ను కేవలం 129 రోజు ల్లో పూర్తి చేశారు. విక్రమ్ సినిమా ను లోకేశ్ కనగరాజ్ కేవలం 110 రోజుల్లో పూర్తి చేశారు.లియో సినిమాను లోకేశ్ కనగరాజ్ కేవలం 125 రోజు ల్లో పూర్తి చేశారట. లోకేశ్ కనగరాజ్ సినిమాలను తెరకెక్కిస్తున్న వేగం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది. తెలుగులో కూడా మార్కెట్ ను పెంచుకుంటున్న ఈ దర్శకుడు రాబోయే రోజుల్లో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ డైరెక్టర్ ఇతర డైరెక్టర్లకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి