పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.. అప్పుడప్పుడు తనకు తన కుటుంబానికి సంబంధించిన అప్డేట్లను సైతం తెలియజేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటుంది రేణు దేశాయ్.. తాజాగా ఇప్పుడు మరొకసారి వార్తలలో నిలుస్తోంది.. తనను మోసం చేశారని రేణు దేశాయ్ చెబుతూనే ఆయనకు డబ్బంటే ఆసక్తి ఉండదని కేవలం సమాజం పట్ల ఉన్న బాధ్యత ఉన్న వ్యక్తి అంటూ పెద్ద కొద్ది రోజుల క్రితం రేణు దేశాయ్ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.



దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు సైతం రేణు దేశాయ్ ని పొగడ్తలతో ముంచేశారు. దీంతో ఈమెను ఎంత మంచిదో అంటూ పొగడ్తలతో ముంచేత్తుతూ ఉన్నారు.. అయితే పవన్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఆమె పైన పలు రకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు.. తాజాగా ఒక నేటిజన్ మాత్రం ఒక కామెంట్స్ చేశారు.. దానిపైన రేణు దేశాయ్ స్పందించడంతో ఆ విషయం నెట్టింట వైరల్ గా మారుతోంది. తాజాగా రేణు దేశాయ్ వీరి మీద స్పందించడంతో.. హా అందుకే నిన్ను పవన్ కళ్యాణ్ తన్ని తరిమేశారంటూ కామెంట్ చేశారు..


దీంతో తన తిట్టడంతో మీకు మనశ్శాంతి దొరికిందా దొరక్కపోతే ఇంకా తిట్టండి నా మాజీ భర్త అభిమానులు యాంటీ ఫ్యాన్స్ నుండి చాలా తిట్లు తిన్నాను నా జీవితంలో కానివ్వండి అంటూ రేణు దేశాయ్ కూల్ గా రిప్లై ఇవ్వడం జరిగింది.. అంతేకాకుండా తన విడాకులు విషయంలో కూడా అసలు విషయం తెలిపింది ఇప్పుడు భారతీయులుగా ఆయనకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు తిడుతున్నారు మొదటిలో తాను వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడానని కామెంట్లు చేశారు.. కానీ ఇప్పుడు నేను మా బాజీ భర్త దగ్గర డబ్బులు తీసుకొని ఇలా మాట్లాడుతున్నానంటూ కామెంట్స్ చేస్తున్నారు.. నేనెప్పుడైనా సరే నిజమే మాట్లాడాను అంటూ చెప్పుకొచ్చింది.. ఇలాంటి శాస్తి జరగాల్సిందే ఇది నా తలరాత అంటూ తిట్టండి అంటూ కామెంట్లు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: