సీతారామం సినిమాతో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో పలకరించి ప్రేక్షకులను అలరించిన దుల్కర్ సల్మాన్.. ఇక ఇప్పుడు యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కింగ్ ఆఫ్ కోత అనే టైటిల్ తో ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల ట్రైలర్ అంచనాలను పెంచేసింది. కాగా ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో తెగ కష్టపడి పోతున్నాడు దుల్కర్ సల్మాన్. అతనికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండడంతో ఇక పాన్ ఇండియా రేంజ్ లో హిట్టు కొట్టాలని భావిస్తున్నాడు.
ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ హిట్టు కొట్టాలంటే ఇక అతను నటించిన కింగ్ ఆఫ్ కోత సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు చేయాలి అనేది చూద్దాం. దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉండడంతో కింగ్ ఆఫ్ కోత మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ కూడా చేసుకుంది. నైజాంలో రెండు కోట్లు సీడెడ్ లో 80 లక్షలు ఆంధ్రాలో 2.2 కోట్లు మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ వివరాలు చూసుకుంటే.. ఈ సినిమా తెలుగులో హిట్ అవ్వాలంటే 5.5 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అయితే మూవీకి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. ఈ తరహా వసూలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అన్నది తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి