పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస లతో ఫుల్ బిజీగా ఉంది. పుష్ప తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించింది.ప్రస్తుతం ఆమె హిందీలో యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా..డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక మరోవైపు పుష్ప 2 చిత్రీకరణలోనూ పాల్గొంటుంది నేషనల్ క్రష్. ఇప్పటికే పుష్ప తో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి సెకండ్ పార్ట్‏లో తన నటనతో మెప్పించేందుకు సిద్ధమవుతుంది. అయితే రష్మిక ఫిట్ నెస్, బ్యూటీ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో చాలాసార్లు రష్మిక జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి.

రష్మిక బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ తన శరీరాన్ని ఆరోగ్యకరంగా.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తుంది. కఠినమైన వ్యాయామాలు చేయడం.. హెల్తీ ఫుడ్ తీసుకుంటుంది. నేషనల్ క్రష్ ఫిట్ నెస్ టిప్స్, సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందామా. వారానికి 4-5 సార్లు రష్మిక జిమ్ కు వెళ్తుంది. బలం, బరువు శిక్షణ, కార్డియో , కోర్ వ్యాయామాలు చేస్తుంది. అంతేకాకుండా ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్, వాకింగ్, కిక్ బాక్సింగ్ కూడా చేస్తుంది.అలాగే రష్మిక అధిక తీవ్రతగల కిక్ బాక్సింగ్ సెషన్స్ నిర్వహిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, జీవక్రియను పెంచడానికి మెగా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. వర్కువుట్స్ మాత్రమే కాకుండా ఆహారం పై పూర్తిగా శ్రద్ధ తీసుకుంటుంది. ఉదయాన్నే ఆపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తో తీసుకుంటుంది.

అలాగే ఆహారంలో సీజనల్ పండ్లు, చిలగడదుంపలు, కూరగాయల సూప్స్, కొబ్బరి నీళ్లు ఉండేలా చూసుకుంటుంది. అలాగే రష్మిక ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతుంది. జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు తీసుకోవడానికి ఇష్టపడదు.అలాగే రష్మిక స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహయపడే అన్ని పోషకాహారం ఉండేలా చూసుకుంటుంది.అలాగే నిత్యం కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది రష్మిక.

మరింత సమాచారం తెలుసుకోండి: