తెలుగు సినీ పరిశ్రమంలో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఈయన కొంత కాలం క్రితమే ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి అవసరాల శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. 

అలా భారీ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ కి "ఓ టి టి" లో మాత్రం ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయి ... "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ రోజు అనగా సెప్టెంబర్ 9 వ తేదీన శనివారం రోజున ఉదయం 10 గంటలకు జెమిని మూవీస్ ఛానల్లో మొదటి సారి ప్రసారం కానుంది. 

మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే నాగ శౌర్య కొంత కాలం క్రితమే ఆ రంగబలి అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అలరించడంలో విఫలం అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: