ఈ చిత్రానికి ప్రభాస్, రానా, రామ్ చరణ్ వంటి పెద్దస్టార్స్ ప్రమోషన్ చేయడంతో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రేక్షకాదరణ పొందడంతో పాటు ఐదురోజుల్లో ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. రూ.14.6 కోట్ల షేర్ అందుకుంది. .యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ అందుకుందీ సినిమా. ప్రస్తుతం స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాను ఆడియెన్స్ కు మరింత చేరువ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది.
అయితే, తమ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సినీ ప్రియులకు, ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కు థాంక్స్ చెప్పింది హీరోయిన్ అనుష్క. ఈ గురువారం ఏపీ తెలంగాణలో లేడీస్ కోసం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారని తెలిపారు. ఆడియెన్స్ నుంచి వచ్చే మెసేజెస్, పోస్ట్స్, ప్రేమ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపింది. చిత్రంలో నవీన్ పొలిశెట్టి కామెడీ, అనుష్క ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునేలా ఉండటం.. పైగా చాలా గ్యాప్ తర్వాత ఇద్దరూ వెండితెరపై మెరవడంతో సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.ఈ సినిమాల్లో ఉన్న కంటెంట్ అనేది ఆడవారికి అందించాలనే ఉద్దేశంతో దీనిని వారికీ స్పెషల్ షో గా వేసి చూపించాలని మేకర్స్ భావించారు.ఈ మూవీ ద్వారా అనుష్క లో మరొక యాంగిల్ బయటపడిందని ప్రేక్షకులు భావిస్తున్నారు.అటు పెద్ద హీరో,చిన్న హీరో అని తేడా లేకుండా తన వంతుగా మూవీ కి న్యాయం చేస్తుందని అభిమానులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి