ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతోబ్మంది ముద్దు గుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్నానానికి ఎదిగిపోతున్నారు. అలాంటి వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితమే శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ యావరేజ్ విజయం సాధించినప్పటికీ ఇందులో ఈ నటి తన నటనతో , అదిరిపోయే అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో ఈ ముద్దు గుమ్మకు ప్రస్తుతం తెలుగు లో వరస క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. 

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో దాదాపు డజన్ సినిమాలు ఉన్నాయి. అందులో చాలా వరకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా స్కంద అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో చాలా ఈవెంట్ లకి ముఖ్య అతిథిగా విచ్చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఓ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వెళ్ళింది. ఇకపోతే తాజాగా శ్రీ లీల ఆరెంజ్ అండ్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకుని ఈవెంట్ కి వెళ్ళింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన శ్రీ లీల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: