బుల్లితెర ప్రముఖ యాంకర్,డైరెక్టర్ ఓంకార్ గురించి ఈ ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  ఓంకార్ త్వరలోనే ఒక హారర్ సిరీస్ తో రాబోతున్నాడు. రాజు గారి గది.3  తర్వాత నాలుగేళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఆయన మళ్లీ ఇప్పుడు తనకి కలిసొచ్చిన హారర్ బ్యాక్ డ్రాప్ లోనే సరికొత్త సిరీస్ తో రాబోతున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. హారర్ థ్రిల్లర్ గా కథాంశంతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు 'మాన్షన్ 24'(Mansion24) అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ లోప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖంతోపాటు చీకటితో నిండిన ప్రదేశంలో ఓ పురాతనమైన బిల్డింగ్ ని చూపించారు. ఈ ఫస్ట్ లుక్ ను బట్టి ఈ పురాతన బిల్డింగ్ లో జరిగే కథగా ఈ వెబ్ సిరీస్ ఉండనుందని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి, అవికా గోర్, అమర్ దీప్ చౌదరి, మానస్, విద్యుల్లేఖ రామన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా మేకర్స్ రివీల్ చేయనున్నట్లు సమాచారం. ఓ పురాతన భవంతిలో అడుగుపెట్టిన కొందరు యువతీ, యువకులకు ఎదురైన పరిణామాలతోనే ఈ వెబ్ సిరీస్ సాగుతుందట. 

ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజు గారి గది' మూవీ తరహాలోనే 'మాన్షన్ 24' వెబ్ సిరీస్ ఉంటుందని అంటున్నారు. ఓంకార్ ఈ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారట. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన 'రాజు గారి గది' ఫ్రాంచైజీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఫ్రాంచైజీలో భాగంగా త్వరలోనే 'రాజుగారి గది 4' కూడా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓంకార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేలా ఓంకార్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: