ఈ ఏడాది టాలీవుడ్ లో శృతి హాసన్ చిరూ సరసన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ అలాగే బాలయ్య తో వీర సింహా రెడ్డి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయలని అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే నేచరల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న హాయ్‌ నాన్న మూవీలో కూడా శ్రుతి హాసన్‌ ముఖ్య పాత్ర లో కనిపించనున్నారు.ఇలా ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ వరుస చిత్రాలలో నటిస్తూ బిజీ గా మారిందిరీసెంట్గా శృతి హాసన్ దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరైయింది.ఆ అవార్డుల వేడుక ముగియగానే శృతి అక్కడ నుంచి బయలుదేరింది. 

భామ ముంబై  ఎయిర్ పోర్ట్ కు చేరగానే అక్కడ గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెంటపడ్డాడు.. తన కార్ పార్కింగ్ ఏరియా వరకు వెంబడించిన ఆ వ్యక్తి వీడియో.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.లేటెస్ట్ గా శ్రుతిహాసన్ ఇన్ స్టా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు. కాగా ఎయిర్ పోర్ట్లో వెంటపడ్డ వ్యక్తి ఎవరనేది అభిమాని అడగగా..శృతి స్పందిస్తూ..అసలు నన్ను వెంబడించిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నేను ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి నన్ను ఫాలో అయ్యాడు. జస్ట్ ఫోటో కోసం అనుకున్నాను. కానీ అంతలోనే ఫోటో గ్రాఫర్ ఆమె పక్కకి వెళ్లి నిల్చోమని చెప్పినపుడు అతను నాకు మరీ క్లోజ్గా వచ్చాడు.దీంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాను.

సాధారణంగా నాకు బాడీగార్డ్స్ ను పెట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు స్వేచ్ఛ కావాలి అని బాడీ గార్డ్స్ ను పెట్టుకోలేదు.. కానీ,ఇప్పుడు బాడీగార్డ్స్ విషయంలో ఆలోచించే సమయం వచ్చింది అని శృతి హాసన్ పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: