
కొంతమంది ఫ్యాన్స్ అయితే చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభిమానులు తమ అభిమాన హీరోలకు సంబంధించిన సినిమా సీన్లను మక్కికి మక్కి దింపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక షారుఖ్ ఖాన్ అభిమాని చేసిన పని మాత్రం అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. ఇటీవల షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ సూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఒంటినిండా కట్లతో షారుఖ్ ఖాన్ ట్రైన్ ఎక్కే ఒక సీను ఉంటుంది. అయితే ఈ సీన్ రీ క్రియేట్ చేయాలి అనుకున్నాడు ఇక్కడ ఒక అభిమాని. అనుకున్నదే తడువుగా ఏకంగా ఒంటినిండా కట్లు కట్టుకొని రైల్వే స్టేషన్ లోకి వెళ్ళాడు. అయితే అతన్ని అందరూ అక్కడ విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. ఇక అచ్చం షారుక్ ఖాన్ తరహాలోనే అతను మెట్రో ట్రైన్ ఎక్కుతాడు అని చెప్పాలి. ఇక ఇది చూసి మెట్రోలో ఉన్న ప్రయాణికులు కూడా షాక్ అవుతారు. అయితే ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో అభిమానం తలకు ఎక్కితే ఇలాగే ఉంటుందేమో అని కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.