నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ భగవంత్ కేసరి.అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని బాలయ్య మళ్ళీ మునుపటిలా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఊపులో ఇప్పుడు మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.. ఈ భగవంత్ కేసరి సినిమా కూడా ఆ రెండు సినిమాల లాగానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.అయితే ఇప్పటి దాకా ఈ సినిమా నుండి పెద్దగా ప్రమోషన్స్ ఏమి చేయలేదు.కేవలం కొన్ని పోస్టర్స్, టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు..ఇటీవలే సాంగ్ రిలీజ్ చేయగా అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ మూవీ దసరా బరిలో రాబోతున్న నేపథ్యంలో రిలీజ్ కు కొద్దీ సమయం మాత్రమే ఉంది. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు..


అయితే ఇదిలా ఉండగా రిలీజ్ కు ముందు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైం ను లాక్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు డీసెంట్ రన్ టైంనే మేకర్స్ ఫిక్స్ చేసారని తెలుస్తుంది. సుమారు 2 గంటల 37 నిముషాల రన్ టైం ను లాక్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. దీనిపై అధికారికంగా క్లారిటీ వస్తే కానీ అసలు విషయం అనేది బయటకు రాదు.ఇక దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల ఇంకా విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: