పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో ప్రస్తుతం మంగళవారం అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇప్పటికే అజయ్ భూపతి , రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో ఆర్ ఎక్స్ 100 అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని పాయల్ నటన కు అజయ్ భూపతి ఆ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వీరికి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇక ఆర్ ఎక్స్ 100 లాంటి అద్భుతమైన విజయవంతమైన సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ చిత్రం బృందం వారు ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ను ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత అజయ్ భూపతి "మహా సముద్రం" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: