సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ మొద్దుగుమ్మ. ప్రస్తుతం నయనతార ఒక్కో సినిమాకి గాను సుమారుగా 10 కోట్లకు పైగా నే తీసుకుంటుంది అని సమాచారం. జవాన్ సినిమాతో ఇటీవల బాలీవుడ్ కి సైతం ఎంట్రీ ఇచ్చిన నాయనతార మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన జవాన్ సినిమా ఏకంగా 1000 కోట్లను వసూలు చేసింది.

 ఇంతటి స్టార్డం అనుభవిస్తున్న నయనతార కెరియర్ బిగినింగ్ లో ఏం చేసింది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే నయనతార కి సంబంధించిన ఒక ఓల్డ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే మొదట నయనతార ఒక మలయాళ టీవీ ఛానల్ లో యాంకర్ గా పనిచేసింది. ఒక షోకి నయనతార వ్యాఖ్యాతగా వ్యవహరించింది. మలయాళంలో అనర్ఘలంగా మాట్లాడుతున్న నయనతార కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక  వైరల్ అవుతుంది. అలా యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన నయనతార 2003లో మనసైనకారే అనే మలయాళ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది.

 ఇక నయనతార అసలు పేరు డయానా. మొదటి సినిమా దర్శకుడు నయనతారగా స్క్రీన్ సేవ్ వేశాడు. అప్పటినుండి ఈమెకి నయనతార అన్న పేరు వచ్చింది. చంద్రముఖి సినిమాతో నయనతార కి బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో ఏకంగా రజనీకాంత్ కి జోడిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత గజినీ సినిమా సైతం ఈమెకి భారీ గుర్తింపును తెచ్చి పెట్టింది. దాని తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం శింబు ప్రభుదేవా లతో నయనతార నడిపిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాదు నయనతారను పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవా, తన భార్యకు సైతం విడాకులు ఇచ్చేశాడు


మరింత సమాచారం తెలుసుకోండి: