నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్న అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించబోతుంది.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ఓ పాటను కూడా విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని రెండవ పాట అయినటువంటి "ఉయ్యాల ఉయ్యాల" అంటూ సాగే సాంగు ను అక్టోబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే అఖండ , వీర సింహా రెడ్డి లాంటి వరుస విజయాల తర్వాత బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: