తమిళ హీరో శివరాజ్ కుమార్ గురించి కొంతమంది తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఆయన నటించిన కొన్ని సినిమాలు అటు తెలుగులో కూడా విడుదలయ్యాయి. కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న శివరాజ్ కుమార్ ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఘోస్ట్ అనే టైటిల్ తో రూపొందిన సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు ఈ హీరో.


 అయితే మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదలవుతూ ఉండగా.. ప్రస్తుతం శివరాజ్ కుమార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే విభిన్న రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నాడు ఈ హీరో  అయితే తన ప్రమోషన్స్ లో భాగంగా అటు తెలుగు హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో భాగంగా మహేష్ బాబు గురించి అడిగిన ప్రశ్నకు శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూపర్ స్టార్ మహేష్ పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి గురించి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు అని చెప్పాలి. మెగాస్టార్ తో ఉన్న అనుబంధం గురించి స్పందించాలని అభిమానులు కోరడంతో శివరాజ్ కుమార్ మెగాస్టార్ తో అనుబంధం గురించి ఒక పోస్ట్ పెట్టాడు.


 లెజెండ్ ఎప్పటికీ లెజెండ్ గానే ఉంటారు. ఆయనను నేను కలిసిన సమయంలో మాట్లాడిన సమయంలో ఎంతో నేర్చుకున్నాను. నేను కలిసిన గొప్ప వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆయన నా పట్ల కనబరిచిన ప్రేమ గౌరవం ఎన్నటికీ మరిచిపోలేను. ఆయనపై నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది అంటూ శివరాజ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోని కూడా పోస్ట్ చేశారు. దీంతో ఇక ఈ స్టార్ హీరో చేసిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: