
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎక్కువగా డిఫరెంట్ జోనర్ సినిమాల తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలి చేస్తోంది. ఇటీవల చంద్రముఖి 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది కంగనా. రాఘవ లారెన్స్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. టైటిల్ రోల్ లో కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కంగనా ఖాతాలో ఉన్న మరో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'తేజస్'(Tejas).
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను గాంధీ జయంతి(అక్టోబర్ 2) సందర్భంగా విడుదల చేశారు. ఈ మూవీలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ తేజస్ గిల్ పాత్రలో నటించింది. టీజర్ విషయానికొస్తే.. గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కంగనా డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మన దేశంపై ప్రేమ కోసం తేజస్ టేకాఫ్ కి సిద్ధమవుతుందని టీజర్ లో ఆసక్తికరంగా చూపించారు. టీజర్ లో కంగనా వైమానిక దళ కమాండర్ గా కనిపించింది. దేశం కోసం పోరాడిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిగా కంగనా లుక్ కూడా ఆకట్టుకుంది. 'భారత్ జోలికి వస్తే వదిలేది లేదు' అంటూ కంగనా టీజర్ చివర్లో చెప్పే డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటిని పెంచేసింది.
ఇక మూవీ ట్రైలర్ ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా అక్టోబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రొన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం తేజస్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సర్వేశ్ మేరా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దేశభక్తి కాన్సెప్ట్ తో వస్తుండంతో ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకి వారం రోజులు ముందు దసరా బరిలో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పెద్దపెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి.