నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మొట్ట మొదటి సారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ  చిత్ర బృందం ఓ పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని రెండవ పాట అయినటు వంటి "ఉయ్యాల ఉయ్యాల" అంటూ సాగబోయే సాంగ్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 03 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వీర సింహా రెడ్డి మూవీ తో పవర్ఫుల్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే అక్టోబర్ 19 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ పై బాలయ్య అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: