టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్ శంకర్. ప్రస్తుతం ఆయన కమల్ హాసన్ తో ఇండియన్ టు సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో గేమ్ చేజర్ సినిమాని సైతం తెరకెక్కిస్తున్నారు.. అయితే ఈ రెండు సినిమాల్లో ఇండియన్ టు సినిమాకి సంబంధించిన పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను సైతం నిర్మాణ సంస్థ అభిమానులతో పంచుకోవడం జరిగింది. దీంతో గేమ్ చేంజర్ సినిమాపై కూడా అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని రాంచరణ్ అభిమానులు

 సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఇండియన్ 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. తాజాగా డబ్బింగ్ పనులను కూడా చిత్ర బృందం స్టార్ట్ చేసినట్లుగా సమాచారం. ఇక ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఒక గ్లిమ్స్ వీడియోని విడుదల చేయడం జరిగింది. అయితే ఆ వీడియోలో శంకర్ కమలహాసన్ ఇద్దరు కూడా డబ్బింగ్ స్టూడియోలో కనిపించారు. దీంతో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి అని అర్థమైంది. యాక్షన్ త్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ సిద్ధార్థ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతున్నారు. 1996లో వచ్చిన సంచలన సినిమా ఇండియన్ భారతీయుడు

 సినిమాకి సీక్వల్ గా ఇది రాబోతోంది. అయితే మరోవైపు మెగా పవర్ స్టార్ రాంచరణ్ గేమ్ చేంజెర్ సినిమాకి సంబంధించిన అప్డేట్లను మాత్రం ఇప్పటివరకు దర్శకుడు శంకర్ ఇవ్వలేదు. దీంతో మెగా ఆయనపై మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో మొదలైనట్లుగా తెలుస్తోంది. దాదాపుగా పది రోజులపాటు సాగే ఈ షెడ్యూల్లో రాంచరణ్ తో పాటు మిగిలిన కొందరు కీలక నటీనటులకు సంబంధించిన సన్నివేశాలను సైతం చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తే బాగుంటుంది అని మెగా పవర్ స్టార్ అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అప్డేట్ని ఇస్తారా లేదా అన్నది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: